ప్రపంచ క్రికెట్‌లో విలక్షణమైన బౌలింగ్ శైలి కలిగిన బౌలర్లు బోలెడు మంది. ఒక్కొక్కరి బౌలింగ్ యాక్షన్ ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా, పాకిస్తాన్ సెన్సేషన్ సోహైల్ తన్వీర్, టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా, శ్రీలంక యువ బౌలర్ మతీష పతిరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యువకుడు బౌలింగ్ శైలి మాత్రం వీరందరికి భిన్నం. ఇలాంటి బౌలింగ్ మీరు ఇప్పటివరకు చూసుండకపోవచ్చు కూడాను.
ఈ యువకుడు తికమకపెట్టే బౌలింగ్ యాక్షన్‌తో బంతిని విసిరాడు. ఇంకేముంది.. ఆ బౌలింగ్ యాక్షన్ చూసేసరికే సగం చచ్చిపోయాడు.. అతని ఎదుర్కొన్న బ్యాటర్. ఎలా ఆడాలో తెలియక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆపై ఇదేం బౌలింగ్ అంటూ నిట్టూర్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగిన ఓ లోకల్ టోర్నమెంట్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
What about this bowling action ??#Cricket ? pic.twitter.com/QnBc7GYiGb
— Zohaib (Cricket King)??? (@Zohaib1981) August 10, 2023
ఈ యువకుడి బౌలింగ్ శైలిపై నెటిజెన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇది బౌలింగ్ నిబంధనలకు విరుద్దమని కొందరు అంటుండగా.. మరికొందరేమో అతడు తన మోచేతిని 90 డిగ్రీలు వంచుతున్నాడని అతనిని సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఈ బౌలర్‌ని వెంటనే పాక్ వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ విచిత్ర బౌలింగ్ యాక్షన్‌ను మీరూ చూసేయండి.