పాకిస్థాన్ చంద్రునిపై ల్యాండ్ అవ్వడానికి క్యూబ్‌శాట్ ప్రాజెక్ట్ శుక్రవారం లాంచ్ చేయనుంది. పాకిస్తాన్ చారిత్రక చంద్ర మిషన్ iCube-Q మే 3న మధ్యాహ్నం 12.50 గంటలకు చైనాలోని హైనాన్ నుంచి చైనా Chang'e 6 లూనార్ ప్రోబ్‌లో ప్రారంభిస్తారని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ మంగళవారం తెలిపింది.
ICUBE-Q ఉపగ్రహాన్ని చైనా షాంఘై యూనివర్సిటీ SJTU, పాకిస్తాన్ జాతీయ అంతరిక్ష సంస్థ సుపార్కో సహకారంతో IST అభివృద్ధి చేసి రూపొందించింది. పాకిస్థాన్ మూన్ మిషన్ విజయవంతం అయితే సౌత్ ఆసియాలో మూన్ మిషన్ చేసిన రెండవ దేశంగా పాకిస్థాన్ కి గుర్తింపు లభిస్తుంది. దక్షిణాసియా దేశాల్లో ఇండియా మూన్ మిషన్ సక్సెస్ చేసిన మొదటి దేశంగా ఉంది.