ప్రస్తుతం పాకిస్థాన్ పసికూన జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం జరుగుతున్న (డిసెంబర్ 2) రెండో టీ20లో పాకిస్థాన్ బౌలర్లు చెలరేగారు. బులవాయో వేదికగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆతిధ్య జట్టును కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. పాక్ స్పిన్నర్ సుఫియాన్ ముఖీమ్ 5 వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అబ్బాస్ అఫ్రిదీ రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్రార్ అహ్మద్, హారీస్ రౌఫ్, సల్మాన్ అఘా తలో వికెట్ తీసుకున్నారు.
20 పరుగులకే ఆలౌట్
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 37 పరుగులతో పర్వాలేదనిపించింది. అయితే ఈ దశలో శరవేగంగా వికెట్లను కోల్పోయింది. పాక్ స్పిన్నర్ ధాటికి వచ్చినవారు వచ్చినట్టు పెవిలియన్ బాట పట్టారు. దీంతో 20 పరుగుల వ్యవధిలో జట్టు ఆలౌట్ అయింది. జింబాబ్వే ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు. ఓపెనర్లు బెన్నెట్ (21),మరుమని (16) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
ALSO READ : IND vs AUS: చరిత్రకు చేరువలో: సచిన్ 14 ఏళ్ళ రికార్డ్ పై జైశ్వాల్ గురి
58 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 5.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 61 పరుగులు చేసి గెలిచింది. ఓమైర్ యూసఫ్ (22), సైమ్ అయూబ్ (36) వేగంగా ఆడి లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్ తో పాకిస్థాన్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఒక మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో చేజిక్కించుకుంది. ఆదివారం (డిసెంబర్ 1) జరిగిన తొలి టీ20 పాకిస్థాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టీ20 డిసెంబర్ 5 న బులవాయో వేదికగా జరుగుతుంది.
A clinical match from Pakistan in Bulawayo, as they take a 2-0 lead in the three-match series!https://t.co/BiTaOwmfBS #ZIMvPAK pic.twitter.com/TS4zkidRuY
— ESPNcricinfo (@ESPNcricinfo) December 3, 2024