PAK vs ENG 2024: మార్పులు ఫలించాయి: 1338 రోజుల తర్వాత పాకిస్థాన్ టెస్ట్ విజయం

PAK vs ENG 2024: మార్పులు ఫలించాయి: 1338 రోజుల తర్వాత పాకిస్థాన్ టెస్ట్ విజయం

రెండో టెస్ట్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ప్రయోగాత్మక మార్పులు ఫలించాయి. ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో 152 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. 297 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 144 పరుగులకే ఆలౌటైంది. 1338 రోజుల తర్వాత సొంతగడ్డపై పాకిస్థాన్ విజయం సాధించడం విశేషం. అంతేకాదు వరుసగా ఆరు టెస్ట్ ఓటముల తర్వాత దక్కిన విజయమిది. ఈ మ్యాచ్ పాక్ గెలవడంతో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమంగా నిలిచింది.చివరిదైన మూడో టెస్ట్ అక్టోబర్ 24 న రావల్పిండిలో జరుగుతుంది. 

2 వికెట్ల నష్టానికి 36 పరుగులతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ను పాక్ స్పిన్నర్లు దెబ్బ తీశారు. నోమన్ అలీ సాజిద్ ఖాన్ ధాటికి ఏ ఒక్కరు కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు. గత మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన బ్రూక్.. డబుల్ సెంచరీ చేసిన రూట్ కనీసం 20పరుగులైనా చేయలేకపోయారు. స్పిన్ కు అనూకూలిస్తున్న పిచ్ పై ఈ జోడీ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. కెప్టెన్ స్టోక్స్ 37 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్లలో నోమన్ అలీ 8 వికెట్లు.. సాజీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు.

ఈ టెస్ట్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో కమ్రాన్ గులాం (118) సెంచరీతో పాకిస్థాన్ 366 పరుగులు చేసింది. అనంతరం మొదట ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ డకెట్ (114)  291 పరుగులకు ఆలౌటైంది. 75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ 221 పరుగులకు ఆలౌటైంది. 297 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 144 పరుగులకే ఆలౌటైంది. సాజిద్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.