T20 World Cup 2024: అమెరికాతో మ్యాచ్.. టీమిండియాకు మద్దతుగా పాకిస్థాన్

T20 World Cup 2024: అమెరికాతో మ్యాచ్.. టీమిండియాకు మద్దతుగా పాకిస్థాన్

టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత క్రికెట్ జట్టు బుధవారం (జూన్ 12) మరో మ్యాచ్ కు సిద్ధమైంది. ఆతిధ్య అమెరికా జట్టుతో ఢీ కొట్టనుంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. రెండు జట్లు కూడా వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరు మీదున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సూపర్ 8 కు అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో గెలిస్తే సూపర్ 8 కు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ ఈ రెండు జట్ల కంటే ఇప్పుడు పాకిస్థాన్ కు కీలకంగా మారింది. 

టోర్నీలో మూడు మ్యాచ్ లాడిన పాకిస్థాన్ ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సూపర్ 8కు వెళ్లే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అమెరికా, భారత్ జట్లపై ఓడిపోయిన పాక్.. కెనడాతో నానా తంటాలు పడి బోణీ కొట్టింది. పాక్ సూపర్ 8 కు అర్హత సాధించాలంటే భారత్ లేదా అమెరికా చివరి రెండు మ్యాచ్ లు ఓడిపోవాలి. భారత్ తమ చివరి మ్యాచ్ కెనడాతో ఆడాలి. అమెరికా తమ చివరి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడాలి. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోతే అమెరికా సూపర్ 8 కు వెళ్తుంది. 

చివరి మ్యాచ్ పసికూన కెనడాతో  టీమిండియా నెగ్గడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అదే ఈ రోజు భారత్ గెలిస్తే సూపర్ 8 కు అర్హత సాధిస్తుంది. అప్పుడు అమెరికా తమ చివరి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. అమెరికా కంటే ఐర్లాండ్ బలమైన జట్టు. అమెరికాపై  ఐర్లాండ్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్ ఐర్లాండ్ పై భారీ తేడాతో గెలిస్తే సూపర్ 8 కు అర్హత సాధిస్తుంది. ఇదంతా జరగాలంటే నేడు అమెరికాపై భారత్ గెలవడం పాకిస్థాన్ కు చాలా కీలకం. ఈ కారణంగా నేడు భారత్ గెలవాలని పాక్ జట్టుతో పాటు ఆ దేశం కోరుకుంటుంది.