PAK vs BAN 2024: స్లో ఓవర్ రేట్.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకు ఐసీసీ బిగ్ షాక్

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. సోమవారం రెండు జట్లకు (ఆగస్టు 26) జరిమానా విధించింది. దీని ప్రకారం పాకిస్థాన్ కు ఆరు డబ్ల్యుటిసి పాయింట్లు, బంగ్లాదేశ్ మూడు డబ్ల్యుటిసి పాయింట్ల కోత విధించినట్టు ఐసీసీ  ధృవీకరించింది. అసలే ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్ కు ఆరు పాయింట్స్ కోల్పోవడంతో ఆ డబ్ల్యూటీసి అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో పాటు మ్యాచ్ ఫీజ్ లో పాకిస్తాన్ కు 30 శాతం.. బంగ్లాదేశ్ కు 15 శాతం జరిమానా పడింది. 

ALSO READ | Buchi Babu tournament 2024: టీమిండియాలో స్థానం కోసం ఆ ముగ్గురు మధ్య తీవ్ర పోటీ

ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. రెండు ఇన్నింగ్స్ ల్లో  174 ఓవర్లలో పేసర్లు 122.3 ఓవర్లు బౌలింగ్ చేయడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో ఆ జట్టు వేయవలసిన దాని కంటే ఆరు ఓవర్లు తక్కువగా వేసింది. మరోవైపు బంగ్లాదేశ్ మూడు ఓవర్లు తక్కువగా వేసింది. పాయింట్లు కోత విధించడంతో బంగ్లాదేశ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతుంది. 

ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పై 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది.తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను  పాక్‌‌‌‌‌‌‌‌ 448/6  స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. బంగ్లా 565 రన్స్‌‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో పాక్ 146 పరుగులకు ఆలౌట్ కాగా.. 30 పరుగుల స్వల్ప టార్గెట్ ను బంగ్లాదేశ్ వికెట్ కోల్పోకుండా ఛేజ్ చేసింది.  రెండు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ రావల్పిండి వేదికపైనే ఆగస్టు 30 నుంచి జరుగుతుంది.