మన దేశంలో పాకిస్తాన్ నటి వీడియో వైరల్.. నేను కాదంటూ గగ్గోలు పెడుతున్న నటి

మన దేశంలో పాకిస్తాన్ నటి వీడియో వైరల్.. నేను కాదంటూ గగ్గోలు పెడుతున్న నటి

ఈమధ్యకాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. దీంతో కొందరు కేటుగాళ్లు ఈ టెక్నాలజీ ని ఉపయోగించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇక ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హీరోయిన్ల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో వదిలి డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. 

దీంతో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సినీ సెలబ్రెటీల పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. ఆమధ్య టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో తీవ్ర కలకలం సృష్టించిన సంఘటన మరువకముందే మరోనటి వీడియో వైరల్ అవుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. 

పాకిస్థాన్ కి చెందిన మథిర మహమ్మద్ అనే నటి పలు సీరియల్స్, సినిమాల్లో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. మథిర సినిమాల్లోకి రాకముందు మోడల్, సింగర్ గా పనిచేసింది. అయితే మథిర ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో కొందరు కేటుగాళ్లు మథిర ఫోటోలను ఉపయోగించి డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా అసభ్యకరంగా వీడియోలు క్రియేట్ చేసి ఇంటర్నెట్ లో వదిలారు. 

ALSO READ | Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ పై మరో కేసు నమోదు.. విచారణకు రావాలని నోటీసులు

ఈ విషయం తెలుసుకున్న మథిర తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించింది. ఇందులోభాగంగా కొందరు నా వ్యక్తులు నా పేరు,  ఫోటోషూట్ ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. అలాగే వాటిని అసభ్యకరంగా చిత్రీకరించారని కాబట్టి వాటిని నమ్మద్దని తన అభిమానులకి సూచించింది.

దీంతో నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ టెక్నాలజీ బాగా పెరిగిపోయిందని దీంతో కొందరు ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హీరోయిన్ల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ షేర్ చేస్తున్నారని కాబట్టి వీటిని అరికట్టాలని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ డీప్ ఫేక్ వీడియో క్రియేటర్స్ ని  నియంత్రించకపోతే భవిష్యత్ లో సోషల్ మీడియాలో వ్యక్తుల ప్రైవసికి భంగం కలగడమేకాకుండా  ఫోటోలు, వీడియోల మిస్ యాజ్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.