ఇటలీలో దొంగతనం చేసిన పాకిస్తానీ బాక్సర్

పాకిస్థానీ బాక్సర్ ఇటలీలో దొంగతనం చేసిన సంఘటన షాకింగ్ గా మారింది. అతను సహచరుడి బ్యాగ్ నుండి డబ్బు దొంగిలించి పారిపోయాడని.. పాకిస్థాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ మంగళవారం (మార్చి 5) తెలిపింది. వివరాల్లోకెళ్తే.. జోహైబ్ రషీద్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఇటలీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని.. పోలీసు నివేదికను కూడా దాఖలు చేశామని ఫెడరేషన్ సీనియర్ అధికారి తెలిపారు.

ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఐదుగురు సభ్యుల్లో జోహైబ్ రషీద్ అక్కడికి వెళ్లినందున చాలా ఇబ్బందికరంగా ఉందని జాతీయ సమాఖ్య కార్యదర్శి కల్నల్ నసీర్ అహ్మద్ అన్నారు. జోహైబ్ 2023సంవత్సరం ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. పాకిస్థాన్ లో గొప్ప ప్రతిభావంతుడిగా గుర్తించబడ్డాడు. ఒక పాకిస్తానీ అథ్లెట్ జాతీయ జట్టుతో విదేశాలకు వెళ్లి అక్కడ నుంచి తప్పించున్న ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 

ALSO READ :- పంచరామాలు.. అరుదైన శివాలయాలు

'పోలీసులకు సమాచారం అందించబడింది. వారు ఇప్పుడు అతని కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం అతను ఇప్పుడు ఎవరితోనూ కాంటాక్ట్ లో లేడు'. అని నసీర్ చెప్పారు.