ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ -ఏ -ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్నారు. రాజధాని ఇస్లామాబాద్ లో రెడ్ జోన్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ నేతృత్వంలోని కాన్వాయ్ పెషావర్ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరింది.
ఇమ్రాన్ ఖాన్ సైతం నిరసనల కోసం ప్రజలు ఏకం కావాలని.. ఇది స్వేచ్ఛ, న్యాయం కోసం జరిగే ఉద్యమం అని పిలుపునిచ్చారు. డిమాండ్లు నెరవేర్చే వరకు అక్కడి నుంచి కదలొద్దని సూచించారు. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇస్లామాబాద్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.