IND vs PAK: ఇండియాకే మా సపోర్ట్ .. పాకిస్థాన్ జట్టు దండగ.. కోహ్లీపై ఇస్లామాబాద్ ఫ్యాన్స్ ప్రశంసలు

IND vs PAK: ఇండియాకే మా సపోర్ట్ .. పాకిస్థాన్ జట్టు దండగ.. కోహ్లీపై ఇస్లామాబాద్ ఫ్యాన్స్ ప్రశంసలు

ఆదివారం(ఫిబ్రవరి 23) పాకిస్థాన్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది.ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. కనీస పోరాట పటిమ చూపించకుండా చేతులెత్తేసిన పాకిస్థాన్ జట్టుపై సొంతదేశంలో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పాకిస్థాన్ లోని కొంతమంది టీమిండియాకు సపోర్ట్ చేస్తూ తమ జట్టుపై మండిపడుతున్నారు. పాకిస్తాన్ జట్టుకు అసలు స్కిల్స్ లేవని వారి లోపాలను ఎత్తి చూపారు. పాకిస్తాన్ జట్టుకు గెలిచే ప్రయత్నం చేయదని.. ఫిట్‌నెస్ ప్రమాణాలు లేవని విమర్శిస్తున్నారు. 

టీమిండియా మ్యాచ్ గెలిచినా అనంతరం విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ సెంచరీని ఇస్లామాబాద్ ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. తాము ఇప్పటికీ భారత జట్టుకే మద్దతు ఇస్తున్నామని ఇస్లామాబాద్ జాతీయులు తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కనీసం 315 పరుగులు చేస్తుందని ఆశించానని, కానీ పాకిస్తాన్ 250 కూడా చేరుకోకపోవడంతో నిరాశ చెందానని కొందరు అన్నారు. ఫీల్డింగ్‌లో పాకిస్థాన్ మెరుగుపడాలని.. బాధ్యతగా ఆడే క్రికెటర్లు పాకిస్థాన్ లో లేరని కొంతమంది ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.

ALSO READ | IND vs PAK: ఇండియా ఓడిపోతుందని చెప్పా.. నన్ను క్షమించండి: ఐఐటియన్ బాబా

సంవత్సరం నుంచి ఫామ్ తో ఇబ్బంది పడుతున్న కోహ్లీ సెంచరీ కొట్టాడు. పాకిస్థాన్ తమ స్కిల్స్ ను మెరుగుపర్చుకోవాలి. అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మాట్లాడుతూ మనం ఓడిపోయినా.. కనీసం విరాట్ కోహ్లీ సెంచరీని ఆపాల్సింది. బ్యాటింగ్ లో బాగా చేయకపోతే.. కనీసం బౌలింగ్ తో అయినా మ్యాచ్‌ను కాపాడుకోవాలి. అని అన్నాడు. పాక్ జట్టు మెరుగుపడటానికి కొత్త క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)ని అభ్యర్థిస్తున్నాను" అని ఒక మహిళ అన్నారు.