పాకిస్తాన్ క్రికెట్ టీంపై ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ క్రికెట్ జట్టు రాబోయే మ్యాచ్ లలో అసైన్‌మెంట్‌ల కంటే వేగంగా వారి ఫిట్‌నెస్‌ను పొందడానికి ప్లాన్ తయారు చేసింది. ఇందుకుగాను ఆ దేశ ఆర్మీతో 12 రోజుల పాటు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. మార్చి 25 నుండి ఏప్రిల్ 8 వరకు శిక్షణా శిబిరంలో దేశ సైన్యంతో కలిసి పనిచేయించాలని బోర్డు డిసైడ్ చేసింది.
పీఎస్‌ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) 2024 ముగిసిన వారం తర్వాత ఈ శిబిరం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రకటనను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వ్ ఐ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ స్టాండ్స్‌లో ఏ పాకిస్తాన్ ఆటగాడు సిక్సర్ కొట్టడం తాను చూడలేదని అన్నారు. అలా కొట్టాలంటే ఆటగాళ్లు ఫిటెనెస్ తో ఉంటేనే సాధ్యమౌతుందని భావించారు.
ప్రతి క్రీడాకారుడి ఫిట్‌నెస్‌ను వేగవంతం చేసేలా ప్రణాళికను రూపొందించాలని బోర్డును కోరిందని చెప్పారు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత, ఐర్లాండ్‌తో ఆడటంతోపాటు ఇంగ్లండ్ టూర్ కూడా ఉంటుందని పీసీబీ ఛైర్మన్ తెలిపారు. అలాగే ఈ ఏడాది చివర్లో వెస్టిండీస్ మరియు యూఎస్ఏలో జరగనున్న T20 ప్రపంచ కప్ ద్రష్టిలో ఉంచుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆటగాళ్లు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు రంజాన్ నెల కొనసాగనంది. అప్పుడు ఆటగాళ్లంతా ఉపవాసంతో ఉంటారు. ఇలాంటి తరుణంలో ఆటగాళ్లు ఏ మేరకు శిక్షణ పొందుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.