
పాకిస్తాన్ మరో కుట్ర చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులను, వారికి సహకరిస్తున్న వారిపై వదిలిపెట్టమని ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ అన్ని రకాలు ఉల్లంఘనలకు పాల్పడుతుంది. సరిహద్దు వెంట కాల్పుల ఒప్పందం ఉల్లంఘించిన పాక్..మరోవైపు భారత్ సైబర్ డిఫెన్స్ ఛేదించేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు.
పహల్గాం దాడిలో పాక్ హస్తం ఉందని భారత్ తేల్చిన తర్వాత పాకిస్తాన్ దళాలు ప్రతి రోజూ నియంత్రణ రేఖపై వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు భారత సైబర్ డిఫెన్స్ పై పాకిస్తాన్ దృష్టి పెట్టింది. భారత్ కు చెందిన ఎడ్యుకేషన్ వెబ్ సైట్లు, వెల్ఫేర్ వెబ్ సైట్ ధ్వంసంచేసేందుకు యత్నించింది.
ఇంటర్నెట్ ఆఫ్ ఖిలాఫత్ అనే మారుపేరుతో పనిచేస్తున్న IOK హ్యాకర్ల బృందం ఈ వెబ్ సైట్లను పాడు చేసేందుకు యత్నించాయని, ఆన్ లైన్ సర్వీసెస్ లో అంతరాయం కలిగించేందుకు , వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే ఇండియన్ లేయర్ బర్డ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ రియల్ టైమ్ లో చొరబాట్లను గుర్తించింది. ఈ హ్యాకర్లు పాకిస్తాన్ కు చెందినవారేనని నిర్దారించారు.
►ALSO READ | జిప్లైన్ ఆపరేటర్ సంకేతం ఇచ్చాడా?..ప్రత్యక్ష సాక్షి రిషబ్ భట్ వీడియో వైరల్
ఆర్మీ పబ్లిక్ స్కూల్(APS) శ్రీనగర్ వెబ్ సైట్, APS రాణిఖేత్ వెబ్ సైట్లు, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్(AWHO) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్ మెంట్ ఆర్గనేజేషన్ పోర్టల్ ను హ్యాక్ చేసేందుకు యత్నించారు. అయితే ఈ నాలుగు వెబ్ సైట్లను వెంటనే వేరుచేసి, పునరుద్దరిస్తున్నారు.