Ram Charan: పాకిస్థాన్ మీడియాలో రామ్ చరణ్ క్రేజ్.. మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్

ఆర్ఆర్ఆర్(RRR) లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రామ్ చరణ్(Ram Charan) క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటోంది. గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాడు రామ్ చరణ్. ఇంటర్నేషనల్ మీడియాలో సైతం ఆయనపై కథనాలు ప్రసారమవుతుండటం విశేషం. ఆ రేంజ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. అల్లూరి సీతారామరాజుగా మూడు విభిన్న లుక్స్ లో కనిపించిన చరణ్.. తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఫిదా చేశాడు. గుండెల్లో కొండంత భారాన్ని మోస్తూ అది మొహంపై కనిపించకుండా రామ్ చేసిన యాంక్టింగ్ కి విమర్శకుల నుండి సైతం ప్రశంసలు దక్కాయి. రామరాజు అంటే రామ్ చరణ్ అనేంతగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు చరణ్. 

మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ఇంట్రో ఫైట్ అయితే సినిమాకే హైలెట్ గా నిలిచింది. దాదాపు రెండు వేళ మంది మధ్యలో దూకి ఒక వ్యక్తి కోసం ఆయన చేసిన పోరాటం ఆడియన్స్ చేత విజిల్స్ వేయించింది. అయితే ఇప్పుడు ఇదే సీన్ గురించి పాకిస్థాన్ మీడియాలో ప్రస్తావని వచ్చింది. పాకిస్థాన్ ను సంబందించిన ప్రముఖ ఎంటర్టెయిన్మెంట్ ఛానెల్ లో రామ్ చరణ్ ఇంట్రో గురించి ప్రస్తావించడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సీక్వెన్స్ గురించి యాంకర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామరాజు పాత్రలో రామ్ చరణ్ వేలమంది మధ్యలో దూకి ఫైట్ చేసి, మళ్ళీ తిరిగి వచ్చి అదే పొజిషన్ లో నిలబడడం అనేది మైండ్ బ్లోయింగ్. అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన శత్రు దేశం పాకిస్థాన్ లో రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవడం మామూలు విషయం కాదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. పర్ఫెక్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అయన దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.