వరల్డ్ కప్ లో భారత్ చేతిలో ఓటమిని పాకిస్థాన్ ఫ్యాన్స్, మీడియా, క్రికెట్ బోర్డు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదోరకంగా భారత్ ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ ఫ్యాన్స్ ప్రవర్తనపై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఐసీసీ మాత్రం పాక్ కి షాకిస్తూ తమ అభ్యర్థిని కొట్టి పారేసింది. ఇదిలా ఉండగా తాజాగా.. పాకిస్థాన్ మీడియా భారత్‌పై బురదజల్లేందుకు గాను అబద్దాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి.
పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్ లో తమ తదుపరి మ్యాచును ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న పాక్ క్రికెటర్లు మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం ఉదయం మడ్‌పైప్ కేఫ్‌లో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ సంఘటనను అడ్డం పెట్టుకొని పాకిస్థాన్ మీడియా తమ వక్ర బుద్ధి చూపించింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ కొందరు పాకిస్తాన్ జర్నలిస్టులు..బ్రేకింగ్ న్యూస్ అంటూ బెంగళూరులో బాంబ్ దాడి అని ప్రచారం చేశాయి. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ భద్రతపై అనుమానాలు.. బాబర్ టీమ్ సేఫ్‌గా ఉన్నట్టు సమాచారం..’ అంటూ ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్స్‌పై ఇండియన్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో పాకిస్థాన్ పై కౌంటర్లు వేస్తున్నారు. భారత్‌లో వన్డే ప్రపంచకప్ నిర్వహించడం ఇదే తలిసారి కాదని ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు లేవని కామెంట్ చేస్తున్నారు. పాక్ దేశంలో మాదిరిగా అంతటా బాంబ్ పేలుడు ఉండదని పాక్ మీడియాపై ట్రోల్స్ చేస్తున్నారు.