అక్కడ  బల్లి ఆయిల్​కు మంచి గిరాకీ ... ఎందుకంటే

అక్కడ  బల్లి ఆయిల్​కు మంచి గిరాకీ ... ఎందుకంటే

వ్యాపారం అంటే లక్​ మీద ఆధారపడి ఉంటుంది. వ్యాపారస్తుల బయటి నుంచి కొనుక్కొచ్చి దాని ఎంతో కొంత అదనంగా అమ్మాలి.  అసలు ఆ వస్తువు కొనే వారే లేకపోతే.. ఆయన కష్టాలు అంతా ఇంతా కాదు.  ఈ తరుణంలో పాకిస్తాన్​ లో  ఓ వ్యాపారి ప్రజల ట్రెండ్​ను గమనించి   సరికొత్త వ్యాపారం ప్రారంభించాడు.  అదే బల్లి నూనె వ్యాపారం... దీనిని ఎందుకు ఉపయోగిస్తారనుకుంటున్నారా.. ఇక మీరే చూడండి.   పాకిస్తాన్‌లో వయాగ్రాపై నిషేధం విధించారు. ప్రస్తుతం ఆ దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితిలో అక్కడ ఓ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సంసార సుఖంలో సంతోషం లేని వారే ఈ వ్యాపారానికి ప్రధాన కస్టమర్లు. వారి నిస్సాహయత వ్యాపారులకు కాసుల పంట పండిస్తోంది. బల్లి  కొవ్వును సంగ్రహించి, తేలు నూనెతో వేడి చేయడం ద్వారా సెక్స్ పవర్ పెంచే నూనెను తయారు చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని ప్రజలు దీనిని ‘సందే కా టెల్’ అని పిలుస్తారు.

రోడ్డు పక్కనే దుకాణాలు

ఈ నూనెను ఎడారి ప్రాంతాల్లో కనిపించే బల్లుల కొవ్వు నుండి తయారు చేస్తారు. ఈ నూనె శాస్త్రీయంగా ఎంతమేరకు  పని చేస్తుందో తెలుసుకునేందుకు రుజువులు లేవు. ఇస్లామాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ సాహబ్ దానిని అర్ధంలేనిదిగా పేర్కొన్నాడు. కానీ పాకిస్థాన్‌లో మాత్రం దీనిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఏ రోడ్డు పక్కన చూసిన వ్యాపారులు కూర్చొని ఈ నూనెను విక్రయిస్తున్నారు. ఈ వ్యక్తులు పంజాబ్, సింధ్ ప్రావిన్స్ నుండి అక్రమంగా వేటాడి బల్లులను తీసుకువస్తారు. సాధారణ బల్లుల కంటే దీని పరిమాణం పెద్దది (2 అడుగుల వరకు)గా ఉంటుంది. రాత్రిళ్లు వలలతో బల్లులను వేటాడుతున్నారు. పట్టుబడితే పారిపోకుండా వాటి వీపును కిరాతకంగా విరగ్గొట్టుతారు. తర్వాత వీటిని ఎగ్జిబిషన్ లాగా వీధుల్లో ప్రదర్శించి కస్టమర్లను ఆకర్షిస్తారు.

నాలుగు చుక్కలకే... 

చమురు తయారీదారులు ఈ బల్లులను కోసి వాటి తోక కింద నుండి ఒక గ్రంధిని బయటకు తీస్తారు. దీని తర్వాత అది ఒక చిన్న పాన్‌లో వేడి చేస్తారు. అదే తర్వాత కస్టమర్‌కు ఇవ్వబడుతుంది. ఈ నూనె లైంగిక శక్తిని అమాంతంగా పెంచుతుందని నమ్మకం. కేవలం నాలుగు చుక్కలు వాడితే చాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని నూనె అమ్మకందారు యాసిన్ అలీ తెలిపారు. లైంగిక శక్తిని పెంచడంలో ఈ ఆయిల్ మ్యాజిక్ లా పనిచేస్తుంది. వ్యాపారులు దానిని సీసాలలో నింపి కస్టమర్లకు విక్రయిస్తారు. డిమాండ్‌పై ఇస్తారు. దీని ధర 600 నుండి 1200 పాకిస్తానీ రూపాయలుగా నిర్ణయించబడింది.

ఈ నూనె లైంగిక శక్తిని పెంచడమే కాకుండా కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, జుట్టు రాలడాన్ని నివారిస్తుందని ఈ నూనె విక్రయదారులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్‌లో ఇలాంటి వ్యాపారం చేస్తున్న వారిని పోలీసులు చాలాసార్లు పట్టుకున్నారు. కానీ 10,000 జరిమానా కట్టి విడుదలయ్యారు. వారు మళ్లీ బల్లులను తీసుకురావడం ద్వారా తమ వ్యాపారం చేయడం ప్రారంభించారు.