పాస్ పోర్టు, వీసాల గురించి మనందరికి తెలుసు.విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్టు తప్పనిసరి. విదేశాల్లో ఇది మనకు గుర్తింపు కార్డు అన్నమాట. విదేశీ ప్రయాణంలో ఇలాంటి గుర్తింపు కార్డులను మర్చి పోతే ఏమవుతుంది..పాస్ పోర్టు లేకుండా విదేశాలకు వెళితే అక్కడి సెక్యూరిటీ అథారిటీ ఊరుకుంటుందా.. చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది..అవసరమైతే జైలుకు పంపుతుంది..లేదా జరిమానా వేస్తుంది..ఇలాంటిదే ఓ పాకిస్తాన్ కు చెందని ఓ మహిళకు ఎదురైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్ లైన్స్ లో పనిచేస్తునన్ ఓ ఎయిర్ హోస్టెస్ తన పాస్ పోర్టు లేకుండా కెనడాకు వెళ్లింది. దీంతో కెనడా అధికారులు ఆమెపై 200 డాలర్ల ఫైన్ విధించారు. కరాచి నుంచి టోరంటో కు వెళ్లే PK 781 విమానంలో తన పాస్ పోర్టును ఉంచుకోవడం మర్చిపోయిందట. కరాచీ విమానాశ్రయంలో ఆమె పాస్ పోర్టు వదిలి వెళ్లినట్లు ఎయిర్ లైన్స్ అధికారి తెలిపారు.
ఇటీవల కెనడాకు వెళ్లిన PIA ఫ్లైట్ అటెండెంట్లు అదృశ్యం అయ్యారు. కొన్ని వారాల్లో కెనడాలో దిగిన తర్వాత 10 మందికి పైగా PIA ఫ్లైట్ అటెండెట్లు కనిపించకుండా పోవడంతో ఈ సంఘటన ఆందోళనకు దారి తీసింది. అయితే ఫైన్ చెల్లించిన అనంతరం ఆమె పాకిస్థాన్ కు తిరిగి వచ్చినట్లు PIA అధికారి ఒకరు తెలిపారు.