బర్గర్​ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..

జనాలు ఏం తింటున్నారో.. ఏమో కాని.. క్షణికావేశంలో జనాలు రెచ్చిపోతున్నారు. ఇటీవల పాకిస్తాన్​ దారుణ ఘటన చోటు చేసుకుంది.  కరాచీలో దారుణ హత్య జరిగింది.  ప్రియురాలి కోసం తెచ్చిన బర్గర్​ ను  నిందితుడి సోదరుని స్నేహితుడు తిన్నందుకు తుపాకీతో కాల్చి చంపిన ఘటన చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే..

 పాకిస్థాన్​లోని కరాచీలో ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ బర్గర్ తిన్నందుకు ఏకంగా తన  తమ్ముడి స్నేహితుడిని హత్య చేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Also Read:చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా?..ఇందులో నిజమెంత

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కరాచీకి చెందిన మాజ​ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (SSP) నజీర్ అహ్మద్ మీర్​ బహర్ కుమారుడు డానియల్  నజీర్ మీర్ తన గర్ల్‌ఫ్రెండ్ షాజియాను ఇంటికి ఆహ్వానించాడు. ఆమె ఇంటికి చేరుకున్న సమయంలో అక్కడ అప్పటికే డానియల్‌ సోదరుడు అహ్మర్, స్నేహితుడు అలీ కిరియో ఉన్నారు. అయితే డానియల్ తనకు, తన గర్ల్ ఫ్రెండ్‌కు ఒక్కొక్కటి చొప్పున రెండు బర్గర్లను ఆర్డర్ పెట్టాడు. అవి వచ్చిన తర్వాత వాటిని తింటూ ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

 డానియల్ సొదరుడు  అహ్మర్ స్నేహితుడు అలీ కిరియో....  దానియల్​గర్ల్ ఫ్రెండ్‌  షాజియా తింటున్న బర్గర్‌ ముక్క కొరికాడు. దీన్ని చూసి కోపంతో ఊగిపోయిన డానియల్ అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరి నుంచి తుపాకీని లాక్కొని అలీ కిరియోపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన అలీ కిరియోను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. అలీ కిరియో స్థానిక సెషన్స్ జడ్జి కుమారుడిగా పోలీసులు గుర్తించారు. వెంటనే నిందితుడు డానియల్‌ను అరెస్టు చేశారు. 

నిందితుడు డానియల్  నజీర్ మీర్ వయస్సు 17 సంవత్సరాలు.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ ఘటన కరాచీలో జరిగింది.  మాజీ పోలీస్​ కుమారుడిపై హత్యా నేరం మోపబడింది.  ఈ కేసు విచారణను  పోలీసులు ఏప్రిల్​ 24 వ తేదీన ముగించి.. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు.  ప్రస్తుతం నిందితుడు డానియల్  నజీర్ మీర్ జైల్లో ఉన్నాడు. ఈ కేసు కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ వార్త రెడ్డిట్​ లో  వైరల్​ అయిన వెంటనే నెటిజన్లు స్పందించారు.  నిందితుడు జైలు  జీవితానికి అర్హుడు అని ఒకరు పోస్ట్​ చేయగా మరొకరు.. మీ కొడుకు బర్గర్​ చంపబడ్డాడని కామెంట్​ చేశారు.  ఇంకొకరు బర్గర్​ కంటే బుల్లెట్​ ఖరీదైనదని రాయగా.. నాలుగో వ్యక్తి మానవుని ప్రాణం  విలువ బర్గర్​ కంటే చాలా తక్కువ అని వ్యంగ్యంగా పోస్ట్​ చేశారు.  ఏది ఏమైనా క్షణికావేశం అతని జీవితాన్ని జైలు పాలు చేసింది.