అక్కాచెల్లెళ్ల వీడియో వైరల్.. వాళ్ళను హత్య చేసిన కుటుంబసభ్యులు

పాకిస్తాన్ లో పరువు హత్యలు జరిగాయి. వరుసకు అక్కాచెల్లెళ్లు అయ్యే ఇద్దరు యువతులు ఒక యువకుడిని ముద్దుపెట్టుకున్నారని వారిద్దరినీ వారివారి కుటుంబసభ్యులే హత్య చేసిన ఘటన పాకిస్తాన్ లోని ఉత్తర వజీరిస్తాన్ ప్రావిన్స్ కు దగ్గరిలోని ఒక గ్రామంలో జరిగింది. యువతులిద్దరూ 22 మరియు 24 ఏళ్ల వయస్సు గల వారుగా గుర్తించారు. వారిద్దరూ ఒక యువకుడిని లిప్ కిస్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక యువకుడు ఇద్దరు మహిళలను పెదవులపై ముద్దు పెట్టుకుంటుండగా.. మరో మహిళ నవ్వుతూ ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతుల కుటుంబసభ్యులు పరువుపోయినట్లుగా బాధపడ్డారు. దాంతో ఒక యువతి తండ్రి మరియు మరో యువతి అన్న ఇద్దరూ కలిసి యువతులిద్దరినీ చంపి కాల్చేశారు. యువతులను చంపిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారి ముహమ్మద్ నవాజ్ ఖాన్ తెలిపారు.

అసభ్యకర వీడియోలో ఉన్న 28 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ యువతుల హత్యలను తీవ్రంగా ఖండించింది. హ్యూమన్ రైట్స్ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ లో ప్రతి సంవత్సరం 1,000 పరువు హత్యలు జరుగుతున్నాయి.

For More News..

విడాకులకు దరఖాస్తు చేసిన ప్రముఖ నటుడి భార్య