ఇస్లామాబాద్: పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అతడు విడ్కోలు పలికాడు. 2018లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హఫీజ్.. తాజాగా వన్డేలు, టీ20ల నుంచి కూడా సన్యాసం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. దాదాపు 18 ఏళ్లపాటు పాక్ క్రికెట్‌కు సేవలు అందించిన హఫీజ్.. 2003లో జింబాబ్వేపై మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగట్రేం చేశాడు. హఫీజ్ లాంటి సీనియర్ క్రికెటర్ హఠాత్తుగా జట్టును వీడటం.. పాక్ జట్టులో పెద్ద లోటుగానే చెప్పాలి.
Pakistan all-rounder Mohammad Hafeez has announced his retirement from international cricket. pic.twitter.com/rpTpT3jp6f
— ICC (@ICC) January 3, 2022
పాక్ తరఫున 55 టెస్ట్‌లు, 218 వన్డేలు, 115 టీ20 మ్యాచ్ ల్లో హఫీజ్ ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ కేరిర్‌లో 21 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతోపాటు, 12 వేలకు పైగా పరుగులు చేశాడు. కాగా, హఫీజ్ తన చివరి మ్యాచ్ టీ20 ప్రపంచకప్–2021 సెమీఫైనల్లో ఆస్టేలియాపై ఆడాడు. ఇకపోతే, ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన హఫీజ్.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ బేస్డ్ లీగుల్లో మాత్రం ఆడనున్నాడు.