ఖైబర్ పఖ్తుంఖ్వా లో పేలుళ్లు
నలుగురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో పార్లమెంటు ఎన్నికలు హింసాత్మక ఘటనల మధ్య గురువారం ముగిశాయి. వరుసగా టెర్రరిస్టు దాడులు చోటు చేసుకుంటుండటంతో వాటిని అడ్డుకోవడానికి ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం విధించింది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించింది. గట్టి భద్రత మధ్య ఉదయం 8కి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రావిన్స్ లలో చలి గాలుల కారణంగా ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. గురువారం రాత్రి నుంచే ఫలితాల వెల్లడి షురూ కానుంది.
ఫలితాలు ఎప్పుడు, సర్వేలు ఏం చెబుతున్నాయ్..!
శుక్రవారం నాటికి పూర్తిస్థాయిలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీప్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్–ఎన్) అధికారాన్ని చేపట్టనుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, పాకిస్తాన్ లో ఎన్నికల రోజు కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో భద్రతా సిబ్బందిపై టెర్రరిస్టులు బాంబులు విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా టెర్రరిస్టులు పరారయ్యారు.
ప్రధాని కాలాంటే ఎన్ని సీట్లు గెలివాలి ?
12 కోట్ల ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆ దేశంలో మొత్తం 336 పార్లమెంట్ సీట్లు ఉండగా.. 266 నియోజకవర్గాల్లో ఎలక్షన్లు జరిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేపట్టాలంటే ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఏ పార్టీ అయినా 133 సీట్లు గెలవాలి. వాటిలో బజౌర్ నియోజకర్గంలో పోటీ చేసే అభ్యర్థి హ్యత చేయబడగా అక్కడ ఎన్నికలు నిలిపివేశారు. మిగిలిన వాటిలో 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు మైనార్టీలకు రిజర్వేషన్ ఉంది.