జపాన్ పాస్ పోర్ట్ పవర్ ఫుల్..పాకిస్థాన్,ఇండియా ?

జపాన్ పాస్ పోర్ట్ పవర్ ఫుల్..పాకిస్థాన్,ఇండియా ?

విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్, వీసా కంపల్సరీ. వీటి ద్వారానే మనం ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే కొన్ని దేశాల పాస్పోర్టులు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆ పాస్పోర్టుతోనే వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా విదేశాలకు వెళ్లే వీలు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్  అసోసియేషన్  అందించిన డేటా ఆధారంగా హెన్లీ ఇండెక్స్‌లో పాకిస్థాన్ అత్యంత చెత్త పాస్ పోర్టుగా తేలింది.   

పాక్ కన్నా సోమాలియా బెటర్

హెన్లీ ఇండెక్స్ లిస్టులో పాకిస్థాన్ చివరి నుంచి నాల్గో స్థానంలో ఉంది. పాకిస్థాన్ తర్వాత ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారు. పాక్ పాస్ పోర్ట్ కలిగిన వ్యక్తులు వీసా లేకుండా గానీ వీసా ఆన్ అరైవల్ ద్వారా ప్రపంచంలోని కేవలం 32 దేశాల్లో ప్రయాణించగలరు. పాకిస్థాన్ కన్నా సోమాలియా పరిస్థితి బెటర్ గా ఉంది. సోమాలియా పాస్ పోర్ట్ ఉన్నవారు వీసా లేకుండా 35 దేశాలకు వెళ్లొచ్చు. 

మెరుగుపడ్డ భారత ర్యాంకింగ్

భారత్ ర్యాంకింగ్ గురించి మాట్లాడితే, అది మెరుగుపడింది. గత సంవత్సరం భారత్ ర్యాంకింగ్ 87 ఉండగా ఇప్పుడు అది 85కి పెరిగింది. ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా 59 దేశాలకు వెళ్లొచ్చు.

జపాన్దే పవర్ ఫుల్ పాస్ పోర్ట్  

హెన్లీ ఇండెక్స్‌లో ఫస్ట్ ప్లేస్ లో  జపాన్ పాస్‌పోర్ట్‌ ఉంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన జపాన్ పాస్‌పోర్ట్  కలిగిన ఉన్న వ్యక్తులు వీసాలేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా ప్రపంచంలోని 193 దేశాలకు ప్రయాణించొచ్చు. జపాన్ తర్వాతి స్థానాల్లో సింగపూర్. దక్షిణ కొరియా ఉన్నాయి, ఆ దేశాల ప్రజలు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా 192 దేశాల్లో ప్రయాణించొచ్చు. లిస్టులో జర్మనీ, స్పెయిన్‌లు మూడో స్థానంలో నిలిచాయి. ఇక్కడి ప్రజలు 190 దేశాల్లో ప్రయాణించవచ్చు. ఫిన్లాండ్, లక్సెంబర్గ్‌, ఇటలీలు లిస్టులో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక ఈ లిస్టులో చివరి పది స్థానాల్లో శ్రీలంక(100), బంగ్లాదేశ్(101). నేపాల్(103), పాకిస్థాన్‌(106) , ఆఫ్ఘనిస్థాన్‌ నిలిచాయి.