ఇస్లామాబాద్: లష్కరే తాయిబా(ఎల్‌ఈటీ) ఫౌండర్ హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని ఇండియా కోరినట్లు పాకిస్తాన్ అంగీకరించింది. అయితే రెండు దేశాల మధ్య బైలేటరల్ ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ (అప్పగింత ఒప్పందం) ఏదీ లేదని చెప్పింది. ‘‘మనీ ల్యాండరింగ్ అంటూ ఓ కేసులో హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని ఇండియన్ అధికారుల నుంచి రిక్వెస్ట్ వచ్చింది.
పాకిస్తాన్, ఇండియా మధ్య ఎలాంటి ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ఉనికిలో లేదన్న విషయం గమనించాలి” అని ఫారిన్ ఆఫీస్ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా చెప్పినట్లు పాక్ మీడియా వెల్లడించింది. హఫీజ్ సయీద్.. 2008 ముంబై దాడుల మాస్టర్‌మైండ్. ఈ క్రమంలో పాకిస్తాన్‌లో ఉన్న సయీద్‌ను తమకు అప్పగించాలని సంబంధిత డాక్యుమెంట్లతో పాక్‌కు రిక్వెస్ట్ పంపినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్జి శుక్రవారం వెల్లడించారు.