ఒక్క రోజుకే ఇంటికి పంపించేశారు: సల్మాన్ బట్‌కు ఘోర అవమానం..సెలక్షన్ కమిటీ నుంచి ఔట్

ఒక్క రోజుకే ఇంటికి పంపించేశారు: సల్మాన్ బట్‌కు ఘోర అవమానం..సెలక్షన్ కమిటీ నుంచి ఔట్

పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ బట్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు ఒక్క రోజులోనే బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్‌కు కన్సల్టెంట్‌గా నియమించబడిన సల్మాన్ బట్.. ఒక్క రోజుకే పదవి నుండి తొలగించబడ్డాడు. నివేదిక ప్రకారం కన్సల్టెన్సీ ప్యానెల్ నుండి బట్ పేరును తక్షణమే ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడానికి చీఫ్ సెలెక్టర్ రియాజ్ శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బట్ స్థానంలో పాక్ మాజీ ప్లేయర్ అసద్ షఫీక్ ను ఎంపిక చేశారు.  

గురువారం (నవంబర్ 30) పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ తో కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అహ్మద్ లను సెలక్షన్ కమిటీలో సభ్యులుగా చేర్చిన సంగతి తెలిసిందే.అక్మల్, ఇఫ్తికార్ అహ్మద్ లను సెలక్షన్ కమిటీలో చేర్చడం పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా..సల్మాన్ బట్ ను ఎంపిక చేయడంతో అందరూ షాక్ కు గురయ్యారు. దీంతో ఈ మాజీ క్రికెటర్ ను తొలగించాలని పాక్ బోర్డు పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. మీడియా నుంచి, అభిమానుల వరకు బట్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

పాకిస్తాన్ క్రికెట్ యొక్క అపెక్స్ అడ్మినిస్ట్రేటివ్ బాడీకి చెందిన 39 ఏళ్ల ఉద్యోగి మాజీ క్రికెటర్‌ను కన్సల్టెంట్‌గా నియమించడం పట్ల అసౌకర్యంగా ఉన్నట్లు అతన్ని కొనసాగిస్తే రాజీనామా చేస్తానని బెదిరించారు. దీంతో సల్మాన్ బట్ పై తప్పిస్తున్నట్లు రియాజ్ తెలియజేశాడు. "ప్రజలు నా గురించి మరియు సల్మాన్ బట్ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే, నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. నేను ఇప్పటికే సల్మాన్ బట్‌తో మాట్లాడాను. నువ్వు నా బృందంలో భాగం కాలేనని చెప్పాను. కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు ఆశ్రయిస్తున్నారు". అని రియాజ్ చెప్పుకొచ్చాడు. 

సల్మాన్ బట్ గతంలో స్పాట్ ఫిక్సింగ్ చేసి శిక్ష అనుభవించాడు. 2010 లో ఇంగ్లాండ్ పై జరిగిన టెస్టులో ఈ మాజీ ఓపెనర్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలాడు. ఇందుకుగాను సల్మాన్ బట్ 5 ఏళ్ళ శిక్షను అనుభవించి క్రికెట్ కు దూరమయ్యాడు. శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత 2016 లో క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సల్మాన్ నిన్న(డిసెంబర్ 1) సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా చేర్చింది.