Paris Olympics 2024: పాకిస్థాన్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం.. మాజీ క్రికెటర్లు సంబరాలు

Paris Olympics 2024: పాకిస్థాన్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం.. మాజీ క్రికెటర్లు సంబరాలు

పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ స్వర్ణ పతకం సాధించాడు. దీంతో వ్యక్తిగత విభాగంలో పాకిస్థాన్ కు తొలి సారి గోల్డ్ మెడల్ లభించింది. అర్షద్ గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు ఒలింపిక్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. గురువారం (ఆగస్ట్) అర్ధ రాత్రి   జరిగిన ఫైనల్లో అర్షద్ ఏకంగా 92.97 మీటర్లు జావెలిన్‌ విసిరి ఆల్ టైం రికార్డ్ సృష్టించాడు. గతంలో ఈ రికార్డు 90.57 మీటర్లుగా ఉంది. బీజింగ్‌ 2008 ఒలింపిక్స్‌లో నార్వేకు చెందిన ఆండ్రియాస్ ఈ ఫీట్‌ సాధించాడు. 

అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ గెలవడంతో ఆ దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. పాకిస్థాన్ షాహీన్స్ క్రికెట్ జట్టు తమ హోటల్ గదిలో సంబరాలు జరుపుకోవడం హైలెట్ గా మారింది. సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్, మహ్మద్ హురైరా అర్షద్ గెలవడంతో సంతోషాన్ని పట్టలేక గంతులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ వసీం అక్రమ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

"అర్షద్ 92.97 మీటర్ల విసిరిన విషయం ఎప్పటికీ మరచిపోలేను. ఇదొక అద్భుతమైన విజయం. అర్షద్‌నదీమ్ మీరు  పాకిస్థాన్ కరువును తీర్చారు. మీంరు సాధించిన విజయం పాకిస్థాన్ కు గర్వ కారణం. మీ ఆటతో  చరిత్రలో ఈ రోజును నిలిచిపోయేలా చేశారు. మీరు సాధించిన ఈ విజయానికి అభినందనలు". అని అక్రమ్ తన ఎక్స్ లో లో తెలిపాడు. భారత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.