బాక్స్ బాంబులతో అటాక్‌కు ప్లాన్.. ఇంటెలిజెన్స్ అలర్ట్ 

న్యూఢిల్లీ: భారత్‌లో భారీ ఉగ్ర దాడులకు పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) వ్యూహం పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. దసరా, దీపావళి పండుగల సమయంలో ఉగ్రదాడులకు ఐఎస్‌ఐ ప్లాన్ చేసిందని.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ట్రాలను ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ను టిఫిన్ బాక్సుల్లో పెట్టి పేలుళ్లకు పాల్పడాలని ఐఎస్‌ఐ స్కెచ్ వేసినట్లు తెలిసింది. 

పండుగల సమయంలో జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ టిఫిన్ బాంబులను పెట్టాలని ఐఎస్‌ఐ వ్యూహంగా ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా వెల్లడైంది. ఐఎస్‌ఐ ఉగ్ర కుట్ర గురించి ఢిల్లీ పోలీసులు ముందుగానే పసిగట్టారు. ఈ నెల 14న దేశ రాజధానిలో పాకిస్థాన్‌కు చెందిన ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్న స్పెషల్ సెల్ పోలీసులు.. పండుగ సమయంలో కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరిలో ఇద్దరు పాక్‌లో ట్రెయినింగ్ తీసుకున్న ఉగ్రవాదులని స్పెషల్ సెల్ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ థాకూర్ చెప్పారు. ఇప్పుడు ఉగ్ర కుట్ర గురించి ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో ఢిల్లీ పోలీసుల అలర్ట్‌కు బలం చేకూరింది. 

మరిన్ని వార్తల కోసం: 

నేను జనంలో ఒకడ్ని.. వెయ్యి మందితో సెక్యూరిటీ అవసరమా?

అయ్యయ్యో వద్దమ్మా.. అలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు 

కాంగ్రెస్ పార్టీనా? లేక ప్రైవేట్ కంపెనీనా?