అదరగొట్టిన పాకిస్థాన్ బౌలర్లు.. తక్కువ స్కోర్ కే పరిమితమైన బంగ్లాదేశ్

అదరగొట్టిన పాకిస్థాన్ బౌలర్లు.. తక్కువ స్కోర్ కే పరిమితమైన బంగ్లాదేశ్


 
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 లో జరుగుతున్న తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ తడబడింది. ఎప్పటిలాగే పాక్ పేస్ త్రయం చెలరేగడంతో కేవలం 193 పరుగులకే ఆలౌటైంది. ఒకదశలో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాను సీనియర్ బ్యాటర్లు షకీబ్(53), ముషఫీకార్ రహీం(64) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లా కోలుకున్నట్లుగానే కనిపించింది. కానీ షకీబ్ ఔటైన తర్వాత బంగ్లాదేశ్ పతనం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. 
 
నిలకడగా పాక్ ఇన్నింగ్స్ 

స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ వికెట్ నష్టానికి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఓపెనర్ ఫకర్ జమాన్(20) తక్కువ స్కోర్ కే పెవిలియన్ కి చేరాడు. ప్రస్తుతం ఓపెనర్ ఇమాముల్ హక్(19) తో పాటు కెప్టెన్ బాబర్ అజామ్(12)క్రీజ్ లో ఉన్నారు. పాక్ ఈ మ్యాచులో గెలవాలంటే 38 ఓవర్లలో మరో 142 పరుగులు చేయాల్సి ఉంది.