రేసులోకి పాక్‌‌‌‌‌‌‌‌..కెనడాపై 7 వికెట్ల తేడాతో గెలుపు

రేసులోకి పాక్‌‌‌‌‌‌‌‌..కెనడాపై 7 వికెట్ల తేడాతో గెలుపు
  •     రాణించిన రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఓడిన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎట్టకేలకు టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలుపు రుచి చూసింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (53 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (33)  రాణించడంతో.. మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బి లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7 వికెట్ల తేడాతో కెనడాపై నెగ్గి సూపర్–8 రేసులో నిలిచింది.  టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన కెనడా తొలుత 20 ఓవర్లలో 106/7 స్కోరు చేసింది ఆరోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (52) హాఫ్ సెంచరీ చేసినా మిగతా వారు నిరాశపర్చారు. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఆరుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరుకే పరిమితమయ్యారు. 

చివర్లో కాలీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సనా (13 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), సాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10) పోరాడే ప్రయత్నం చేసినా పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏమాత్రం చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో ఆమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రవూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో రెండు, షాహీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నసీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో ఓ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశారు. తర్వాత పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 17.2 ఓవర్లలో 107/3 స్కోరు చేసి గెలిచింది. ఐదో ఓవర్లోనే సయీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6) వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడినా, రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బాబర్ నిలకడగా ఆడారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ముందుకెళ్లారు. 

రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 63 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటయ్యాడు. చివరి వరకు క్రీజులో ఉన్న రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4), ఉస్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖవాజ (2 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో కలిసి పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విజయాన్ని అందించాడు. డిలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెలిజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు తీశాడు. రిజ్వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రెండింటిలో ఓడిన కెనడా సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–8 బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దాదాపుగా దూరమైంది. ఇక ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది.