టేస్టీ ఫుడ్ : పకోడీ, టీ కాంబినేషన్ మంచిదేనా.. ఆరోగ్యమేనా..

 టేస్టీ ఫుడ్ : పకోడీ, టీ కాంబినేషన్ మంచిదేనా.. ఆరోగ్యమేనా..

 సాయంత్రం 5, 6 గంటలు అయ్యిందంటే చాలు.. ఉద్యోగులు, వ్యాపారులు అని కాదు.. ప్రతి ఒక్కరూ అలా సరదాగా బయటకు వచ్చి స్నాక్స్ తీసుకోవటం కామన్. స్నాక్స్ తర్వాత టీ, కాఫీ తాగుతారు.. రిలాక్స్ అవుతారు.. బ్రెయిన్ రీ ఫ్రెష్ చేసుకుంటారు.. దేశంలో అత్యధిక జనం పకోడీ, టీ కాంబినేషన్ ఎక్కువగా ఇష్టపడతారనేది సర్వేలు చెబుతున్నాయి.. ఇంతకీ పకోడీ, టీ కాంబినేషన్ ఆరోగ్యానికి మంచిదేనా లేదా అనేది తెలుసుకుందాం...

టీతో పాటు పకోడీలు తినడంద్వారా గొప్ప అనుభూతి పొందుతారు. పకోడీలు టీతో కలిపి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ సీజన్‌లో పకోడీలకు డిమాండ్ బాగా ఉంటుంది. ఇంట్లోనే కాకుండా బయట కూడా వీటిని వర్షం కురిసే సమయంలో కలిపి తీసుకుంటూ ఉంటారు. . కానీ టీతో వేయించిన ఆహారం  తినడం ఏమాత్రం మంచిది కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. టీతో పాటు పకోడీలు తినడం ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలు వెల్లడించాయి. . 

జీవక్రియ..  టీతో పకోడీలను తినడం వలన జీవక్రియ మందగిస్తుందని  ఓ నివేదికలో వెల్లడైందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  టీ... పకోడి కాంబినేషన్​ జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. పకోడీలను శనగపిండితో తయారు చేస్తారు.  ఇది అజీర్ణ సమస్యలు కలుగజేస్తుంది.  వర్షాకాలంలో సహజంగానే జీవక్రియ మందగిస్తుంది. దీనికారణంగా  ఆరోగ్య సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.  
టీతో పాటు పకోడీలు తినడం వల్ల శరీరంలో పోషకాహారం శోషణ మందగించవచ్చని పోషకాహారానిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ఈ రెండిటినీ కలిపి తీసుకోకుండా ఉండడం మంచిది.  

జంక్ ఫుడ్స్ : వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం అనేది ఏ సీజన్‌లోనూ ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు. నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పకోడీలు మాత్రమే కాదు, టీతో పాటు బిస్కెట్లు, జంక్ ఫుడ్స్ తినకూడదు. దీని కారణంగా శరీరానికి తక్కువ పోషకాలు అందుతాయి. పలు రకాల అనారోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. టీ, బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, బిపి, బెల్లీ ఫ్యాట్, ఎసిడిటీ, ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. వర్షాలు కురుస్తున్న సమయంలో తీసుకునే ఆహారం, తాగే పానీయాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.