తొర్రూరు, వెలుగు: కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలను, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో తొర్రూరు, పెద్దవంగర మండలాల ముఖ్యకార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లోని సోషల్ మీడియా కోఆర్డినెటర్లను ప్రోత్సహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, ముత్తినేని సోమేశ్వర్, సుంచు సంతోష్, నాయక్ పాల్గొన్నారు.