
తొర్రూరు/ పాలకుర్తి, వెలుగు: పేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్సర్కార్ నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం తొర్రూరులో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండలాలకు చెందిన 104 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 33,93,000 విలువైన చెక్కులను అందించినట్లు తెలిపారు.
తొర్రూరు టీచర్స్ కాలనీలో పుడమి, నరసింహులపేట రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛమైన మాంస విక్రయ కేంద్రంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇదిలా ఉండగా, పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ర్ట నాయకుడు జవ్వాజి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో కళాకారులు కలిశారు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతి పత్రం అందజేశారు.