పాలకుర్తి, వెలుగు : ఆటలతో శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు స్నేహభావం పెరుగుతుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు, ఆటల్లోనూ ప్రోత్సహించాలని సూచించారు.
అనంతరం సేవాదళ్ ఆర్గనైజర్ గుగ్గిళ్ల ఆదినారాయణ అందజేసిన దుప్పట్లను వృద్ధులకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, ఎన్‌ఆర్‌ఐ బొబ్బల రమణారెడ్డి, సర్పంచ్ కొమురయ్య పాల్గొన్నారు.
టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి
తొర్రూరు, వెలుగు : టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జోనల్ స్థాయి విద్యా సదస్సులో ఆమె మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను ప్రభుత్వానికి వివరించి పరిష్కరిస్తానని చెప్పారు. సోమారపు ఐలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ హైకోర్టు మాజీ జడ్జి చంద్రకుమార్
నర్సింహారెడ్డి, ఝాన్సీ రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, మహంకాళి బుచ్చయ్య, కవిత, శ్రీశైలం, విష్ణువర్ధన్‌రెడ్డి, అలీ పాల్గొన్నారు. అనంతరం తొర్రూరులోని రామ ఉపేందర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వాసవీ క్లబ్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.