తొర్రూరు, వెలుగు : ఫర్టిలైజర్దుకాణ యజమానులు స్టాక్, ధరల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సూచించారు. శనివారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర, తొర్రూరులోని పలు ఎరువుల సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రోమోర్ సెంటర్ లోని పత్తి విత్తనాలు, పలు రికార్డులను పరిశీలించారు.
గ్రోమోర్ సెంటర్, ఫర్టిలైజర్ షాపులలో నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.