మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మామిడాల యశస్వినిరెడ్డి

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మామిడాల యశస్వినిరెడ్డి

తొర్రూరు, వెలుగు: మహిళల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో నాబార్డ్ సహకారంతో సొసైటీ ఫర్ లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన లైవ్ లిహుడ్ ఎంటర్​ప్రైజ్ డెవలప్​మెంట్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. 

ఈ సందర్భంగా యశస్వినిరెడ్డి మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. అనంతరం మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో మిషన్​ భగీరథ, ఆర్​అండ్​బీ అధికారులతో సమీక్షించారు.  కార్యక్రమంలో పెద్దవంగర ఎంపీపీ సబిత, అధికారులు ప్రజలు పాల్గొన్నారు. 

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి 

రాయపర్తి: ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో హనుమకొండ ఏకశిల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి, వైద్య పరీక్షలను పరిశీలించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు అమ్యా నాయక్, పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఊగ మునిత తదితరులు పాల్గొన్నారు.