తెలంగాణ సీఎంను కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

తొర్రూరు, వెలుగు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం హైదరాబాద్​లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

పాలకుర్తి అభివృద్ధికి నిధులు కేటాయించాలని, నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరామని, సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.