బీఆర్ఎస్, బీజేపీకి గుణపాఠం చెప్పాలి : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

తొర్రూరు, వెలుగు : ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో మండల, పట్టణ, వివిధ గ్రామాల యూత్ అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతి బీఆర్ఎస్, మోసపూరిత బీజేపీలను ప్రజలు నమ్మడం లేదన్నారు.

కాంగ్రెస్ తోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి 50వేల మెజార్టీ రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రాజేశ్​ నాయక్​, వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.