సంధ్యారాణి చేరిక బీజేపీకి బలం..

సంధ్యారాణి చేరిక బీజేపీకి బలం..

పాలకుర్తి జడ్పీటసీ కందుల సంధ్యారాణి బీజేపీలో చేరడం శుభపరిణామమన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి.  ఆమె అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లో మంచిపేరు సంపాదించుకున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. సంధ్యారాణి  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడం పార్టీ బలోపేతానికి  దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.