బీఆర్ఎస్ పార్టీకి షాక్.. పాలకుర్తి జడ్పీటీసీ రాజీనామా

పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, పాలకుర్తి జడ్పీటీసీ సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేశారు.  తన రాజీనామా లేఖను మంత్రి కేటీఆర్ కు మెయిల్ ద్వారా పంపిచినట్లు ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో స్వతంత్రంగా బరిలో దిగుతానని సంధ్యారాణి చెప్పారు. 

రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆమె ప్రకటించారు. కొంగు చాపి అడుగుతున్న రామగుండం ప్రజలు అవకాశం ఇవ్వాలని సంధ్యారాణి కోరారు.