ప్రజలు అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్ విజయేందిర బోయి

ప్రజలు అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్  కలెక్టరేట్, వెలుగు : రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలమూరు కలెక్టర్  విజయేందిర బోయి కోరారు. వర్షాల నేపథ్యంలో అధికారులతో టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించి పలు సూచనలు చేశారు. అనుమతి లేకుండా అధికారులు హెడ్​ క్వార్టర్​ విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకుండా చూడాలన్నారు. కలెక్టరేట్​లో కంట్రోల్  రూమ్  ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో 08542241165 నంబర్​కు ఫోన్  చేసి సాయం పొందాలన్నారు.

గద్వాల : వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్ ప్రకటించిన దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గద్వాల కలెక్టర్  సంతోష్  ఒక ప్రకటనలో కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని, ఏమైనా సమస్య ఉంటే హెల్ప్  లైన్  నంబర్  9100901605ను సంప్రదించాలని కోరారు.
 

Also Read : - మన్యంకొండకు పోటెత్తిన భక్తులు

నాగర్​కర్నూల్ : ​రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇందులోభాగంగా కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ బదావత్  సంతోష్ తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్  రూమ్  నంబర్  08540-230201కు సమాచారం అందించాలని కోరారు. ఇబ్బందులు తలెత్తిన ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపడతామన్నారు.

నారాయణపేట : భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గ  ప్రజలు, అధికారులు అప్రమత్తంగా  ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సూచించారు. శనివారం నారాయణపేట, కోయిలకొండ మండలాల్లో పర్యటించారు. నారాయణపేట మండలం అమ్మిరెడ్డి పల్లి గ్రామ శివారులోని యతన్ కుంటకు గండి పడి పొలాల్లోకి నీరు చేరడంతో అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. గండిని పూడ్చి వేయడంతో పాటు రిపేర్లు చేయాలని ఇరిగేషన్​ ఆఫీసర్లను ఆదేశించారు. కోటకొండ, నెమ్ముల పల్లి, గ్రామాల చెరువులను పరిశీలించారు. శివారెడ్డి, రాజిరెడ్డి, వెంకు గౌడ్, అఖిలేశ్వర్ రెడ్డి ఉన్నారు.