- ఇయ్యాల, రేపు గ్రూప్–3 ఎగ్జామ్స్
- ఉమ్మడి పాలమూరులో పరీక్ష రాయనున్న 50 వేల మంది
- గంటన్నర ముందే సెంటర్లకు చేరుకోవాలి
- జువెలరీ, షూస్, మొబైల్స్‌కు నో ఎంట్రీ
- పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
నాగర్ కర్నూల్.వెలుగు: టీజీపీఎస్సీ గ్రూపు-3 ఎగ్జామ్స్ కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 (హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ), 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 (ఎకానమీ అండ్ డెవలప్ మెంట్) పరీక్షలు జరగనున్నాయి.
50 వేల మంది అభ్యర్థులు.. 154 సెంటర్లు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ఐదు జిల్లాల పరిధిలో 50,299 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 154 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 52 పరీక్షా కేంద్రాల్లో 19,465 మంది అభ్యర్థులు, నాగర్ కర్నూల్ జిల్లాలో 33 సెంటర్లలో 9,748 మంది, గద్వాల జిల్లాలో 25 కేంద్రాల్లో 8,570 మంది, నారాయణపేట జిల్లాలో 13 పరీక్షా కేంద్రాల్లో 4,039 మంది, వనపర్తి జిల్లాలో 31 సెంటర్లలో 8,312 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
సీసీ కెమెరాలు, లైవ్ టెలికాస్ట్
ఎగ్జామ్స్ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లైవ్ టెలికాస్ట్ ద్వారా టీజీపీఎస్సీ అధికారులు ఎగ్జామ్స్ తీరును మానిటరింగ్ చేస్తారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేసి, బీఎన్ఎస్163 సెక్షన్ అమలు చేస్తారు.
ఐదారు సెంటర్లను ఒక రూట్‌గా విభజించి రూట్, జాయింట్రూట్ఆఫీసర్లుగా ఎంఈవోలు, మండలస్థాయి అధికారులను నియమించారు. ప్రతి సెంటర్లో ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్అధికారులు, ఐడెంటిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్లను, ఎగ్జామ్స్ నోడల్ ఆఫీసర్లను నియమించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బందిని నియమించారు. తాగునీరు, టాయ్‌లెట్స్, కరెంట్సప్లై తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆర్టీసీ అధికారులు సెంటర్ల వరకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు.
నిబంధనలు ఇవీ..
నిమిషం నిబంధనను స్ట్రిక్ట్‌గా అమలు చేయనున్నారు. అభ్యర్థులను గంట ముందు నుంచే సెంటర్లోకి అనుమతిస్తారు. అరగంట ముందే గేట్లు క్లోజ్చేస్తారు.
అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్, ఒరిజినల్ ఫొటో ఐడెంటిటీ కార్డు (ఆధార్, పాస్ పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర), బ్లాక్, బ్లూ బాల్ పెన్నులు తెచ్చుకోవాలి.
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్, ఎనలాగ్/ డిజిటల్ వాచ్, బ్లూటూత్ లను లోపలికి అనుమతించరు. జువెలరీ, షూస్ ధరించకూడదు.