మహబూబ్‌నగర్ కలెక్టరేట్, వెలుగు : న్యాయవాదులకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కోర్టులో లాయర్లకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి ఆరోగ్య కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదులకు అండగా ఉంటుందని తెలిపారు.
అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేశ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, రాంనాథ్ పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యను అందించండి
హన్వాడ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. బోయపల్లి జడ్పీ హైస్కూల్లో బుచ్చన్నగౌడ్ స్మారకార్థం ఆయన సతీమణి వనమాల నిర్మించిన అడిషనల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించారు. దాతను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీచర్ల సమస్యలను పరిష్కారించామని తెలిపారు.
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీఈవో రవీందర్, ఎంఈవో జయశ్రీ, హెచ్ఎం కవిత పాల్గొన్నారు. అనంతరం మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.