పీయూలో కాంట్రాక్ట్​ లెక్చరర్ల నిరసన

పీయూలో కాంట్రాక్ట్​ లెక్చరర్ల నిరసన

రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పని చేస్తున్న 1,335 కాంట్రాక్ట్​ లెక్చరర్లను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్  చేస్తూ పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్ట్​ లెక్చరర్లు బుధవారం నిరసనకు దిగారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో యూనివర్సిటీలోని పీజీ కాలేజీ ఎదుట నినాదాలు చేశారు. పీయూటీఏ అధ్యక్షుడు డా.వంగరి భూమయ్య, రవికుమార్, విజయ్ భాస్కర్, స్వాతి, సుజాత, రంగప్ప ,వినోద్, సుదర్శన్ రెడ్డి ,ఈశ్వర్, సోమేశ్, గౌస్, గురు, రవికాంత్, సిద్దు, శ్రీనివాస్, సుస్మిత, సోమేశ్, శైలేశ్​ పాల్గొన్నారు.

నాన్​ టీచింగ్​ స్టాఫ్​ ఆధ్వర్యంలో..

పాలమూరు యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్  ఆర్  రవీందర్, సూపరింటెండెంట్  రామ్మోహన్, బుర్రన్న, బద్వేల్, సూర్య, రామకృష్ణ, సంతోష్, నరేశ్, వెంకటేశ్, బాలరాజ్, యాదయ్య, శేఖర్, బాలకృష్ణ, పవన్  పాల్గొన్నారు.