- బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన రోజే బీ ఫామ్
షాద్ నగర్,వెలుగు: బీజేపీ నుంచి షాద్ నగర్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి శనివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రసాద్ ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం షాద్ నగర్ నుంచి పార్టీ తరఫున అభ్యర్థిగా బీ-ఫాం అందుకున్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపైన, ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపై పోటీ చేస్తున్నానన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.