కూసుమంచి, వెలుగు : కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలంలో జుపేడలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో అమలు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మరిన్ని పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. స్వేరోస్ జిల్లా ఉపాధ్యక్షుడు జనక వెంకటేశ్వర్లు, మాట్టే యలేందర్, నిమ్మల నర్సింహారెడ్డితో పాటుగా 12 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరాయి. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, పాలేరు నియోజకవర్గ ఎన్నిక సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి, నాయకుడు తాళ్లూరి జీవన్ కుమార్ పాల్గొన్నారు.