కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు ఎడమ కాలువ మరమ్మత్తులను ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాలేరు ఎడమ కాలువ గండి పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక మరమ్మత్తులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు.
త్వరితగతిన పనులను పూర్తి చేయించి పాత కాల్వ పరిధిలోని 25 వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు అందేలా మంత్రి చర్యలు చేపట్టారు. గండి పూడ్చివేసి పంటలకు సాగునీటిని విడుదల చేయటం పట్ల రైతులు ఊపిరి పీల్చుకున్నారు.