కొద్దిరోజుల్లో నాపై ఐటీ దాడులు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు :  కొద్ది రోజుల్లో తన ఇంట్లో కూడా ఐటీ దాడులు జరుగుతాయని పాలేరు  నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సిటీలోని తన  క్యాంపు ఆఫీస్​లో  బుధవారం  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొంతమంది పోలీస్ అధికారులు బీఆర్ఎస్ కు  తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, ఇబ్బందులకు గురిచేసే పోలీసులకు  తగిన మూల్యం తప్పదని  హెచ్చరించారు. ఈ ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్   అభ్యర్థులు అందరూ గెలవడం ఖాయమన్నారు.