![పాలేరు ప్రాజెక్టు నుంచి రెండు రోజుల్లో సాగునీటి విడుదల](https://static.v6velugu.com/uploads/2025/02/paleru-project-water-release-halted-paddy-crops-affected-in-yasangi-season_vr5TRhlZfM.jpg)
కూసుమంచి, వెలుగు : యాసంగి సీజన్లో వరి పంటకు పాలేరు ప్రాజెక్టు నుంచి నీటిని కొద్ది రోజులుగా ఇరిగేషన్ అధికారులు నిలిపివేయగా పంటలు ఎండుముఖం పట్టాయి. ఈ క్రమంలో రెండు రోజుల్లో పాత కాలువకు సాగునీటిని విడుదల చేస్తామని ఐబీ డీఈ మధు శుక్రవారం తెలిపారు. 9 రోజులు ఆన్, 6 రోజులు ఆఫ్పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
జలాశయం నీటిమట్టం తగ్గడంతో తాగునీటిని దృష్టిలో పెట్టుకొని భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి ఎస్సారెస్సీ కాలువ ద్వారా 170 క్యూసెక్కులు, మిషన్ భగీరథ తాగునీటికి 135 క్యూసెక్కులు, సాగర్కాలువకు 4,233 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉండగా, సాగర్ నుంచి ఇన్‌ఫ్లో 4,328 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం15 అడుగులు ఉందని చెప్పారు.