పాలేరు జలాశయానికి నాలుగు రోజుల నుంచి సాగర్ జలాలు వస్తున్న సంగతి తెలిసిందే. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 23 అడుగులు కాగా, గురువారం నాటికి 17 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. సాగర్‌నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయగా నేటితో నీటి సరఫరాను అధికారులు నిలిపేశారు. ఫ్లో తగ్గడంతో మరో అర అడుగు శుక్రవారం నాటికి జలాశయానికి చేరుకోనుంది.
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని రోజుకు 135 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం నీరు మరో 72 రోజుల వరకు తాగునీటి అవసరాల కోసం వినియోగించవచ్చునని ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు.
కూసుమంచి, వెలుగు