- రఫాపై ఇజ్రాయెల్ దాడిని అమెరికా మాత్రమే ఆపగలదు: పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్
- రఫాపై ఇజ్రాయెల్ దాడి, 13 మంది మృతి
గాజా సరిహద్దు నగరమైన రఫాపై ఇజ్రాయెల్ దాడిని పాలస్తీనీ అథారిటీ ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ ఖండించారు. రఫాపై ఇజ్రాయెల్ దాడుల్లో కొన్ని రోజుల్లోనే పాలస్తీనా జనాభాలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చిందని.. ఒక్క అమెరికా మాత్రమే ఈ దాడులను ఆపగలదని అన్నారు. మరోవైపు ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంఘాలు రఫాపై దాడి విపత్తు అని హెచ్చరిస్తున్నారు.
గత వారం రోజులుగా రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేయాలని ప్రపంచ దేశాలు విజ్ణప్తి చేస్తుననా ఇజ్రాయెల్ వినిపించుకోవడం లేదు.గాజా దక్షిణ నగరమైన రఫాపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో 13 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. రెండు విమానాలతో రఫా నగరంలోని నివాసాలపై బాంబుల వర్షం కురిపించింది.
రఫా దాడిని కొనసిగించవద్దని ఇజ్రాయెల్ కోరాలని యూనెటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పిలుపునిచ్చాం.. ఇజ్రాయెల్ ను ఈ దాడులకు పాల్పకుండా నిరోధించగలికే ఏకైక దేశం అమెరికా మాత్రమే అని సౌది రాజధాని రియాద్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక ప్రత్యేక సమావేశంలో అబ్బాస్ అన్నారు.పాలస్తీనా చరిత్రలో అతిపెద్ద విపత్తు అని అబ్బాస్ అన్నారు.
ఈజిప్లు సరిహద్దును ఆనుకొని ఉన్న దక్షిణ నగరం గాజాపై దాడి చేయకుండా ఆపాలని యూఎస్ తో సహాపాశ్చాత్య దేశాలు విజ్ణప్తి చేశాయి. ఏడు నెలల సుదీర్ఘ దాడుల్లో నిరాశ్రయులైన మిలియన్ కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించారు.