రెస్టారెంట్‌‌గా మారిన విమానం

 రెస్టారెంట్‌‌గా మారిన విమానం
  • 20 ఏండ్ల కల నిజం చేసుకున్న కవల సోదరులు

రెస్టారెంట్‌‌లో ఫుడ్‌‌ తినడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఫ్లైట్‌‌ రెస్టారెంట్‌‌లో ఫుడ్‌‌ తినడం నిజంగా వండర్‌‌‌‌ఫుల్‌‌ మెమొరీనే. అందుకే  ఇద్దరు అన్నదమ్ములు ఓ ఫ్లైట్‌‌నే రెస్టారెంట్‌‌గా మార్చేశారు. ఆ విమానానికి కూడా చాలా చరిత్రే ఉంది. దీంతో అందులో తినడానికి వచ్చేవారికంటే.. దాన్ని చూడ్డానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువై పోయింది. గాల్లో ఎగరాలన్న కోరిక తీరకపోయినా కనీసం ఫ్లైట్‌‌లో ఫుడ్‌‌ తినాలన్న కోరిక మాత్రం తీరుతోందట అక్కడి వాళ్లకు. ఇంతకీ ఎక్కడ ఉందీ ఫ్లైట్​ రెస్టారెంట్​ అనుకుంటున్నారా? పాలస్తీనాలో ఉంది.

ఖామిస్‌‌ అల్‌‌ సైరాఫీ, అటాలు ట్విన్స్‌‌. వారిద్దరూ కలిసి ఇరవయ్యేండ్లుగా ఓఫ్లైట్‌‌ను రెస్టారెంట్‌‌గా మార్చాలని కల కన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నివసించే వారికి 99 శాతం విమానం ఎక్కే అవకాశం లేదు. అందకే ఓ పాత బోయింగ్‌‌ 707 విమానాన్ని రెస్టారెంట్‌‌గా మార్చేశారు. పాలస్తీనాలోని నబ్లస్‌‌ సిటీలో ఉన్న వెస్ట్‌‌ బ్యాంక్‌‌ ఏరియాలో ల్యాండ్‌‌ అయి ఉన్న ఈ ఫ్లైట్‌‌ను ఈటెరీ ప్లేస్‌‌గా తీర్చిదిద్దారు.  జులై 21 నుంచి రెస్టారెంట్‌‌, కాఫీ షాప్‌‌ను స్టార్ట్‌‌ చేశారు. ఫ్లైట్‌‌ లోపల సేమ్‌‌ రెస్టారెంట్‌‌ మాదిరే టేబుల్స్‌‌, చైర్స్‌‌ను అమర్చారు. విమానం కింద ఉన్న ఖాళీ జాగాను గార్డెన్‌‌ రెస్టారెంట్‌‌లా తీర్చిదిద్దారు. ట్విన్స్‌‌ ఐడియా బాగానే వర్కవుట్‌‌ అయ్యింది. పబ్లిక్‌‌ను బాగానే అట్రాక్ట్‌‌ చేస్తోంది అ రెస్టారెంట్.
ఫ్లైట్​ ఏజ్​ 60 ఏండ్లు
1961 కాలం నాటిది అయిన ఈ ఫ్లైట్‌‌ 1993 వరకూ ఉపయోగంలోనే ఉంది. 1978లో అప్పటి ప్రధాని మెనాచెమ్‌‌ బిగిన్‌‌ ఈజిప్ట్‌‌తో ఇజ్రాయెల్ చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి ఈ ఫ్లైట్‌‌ని వాడారు. ఆ తర్వాత దీన్ని ఇజ్రాయెల్‌‌ బిజినెస్‌‌ మెన్‌‌ సొంతం చేసుకున్నారు. వాళ్లు కూడా దీన్ని రెస్టారెంట్‌‌గా మార్చాలని అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితులు సహకరించకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత వారు ఫ్లైట్‌‌ని నబ్లస్‌‌ తీసుకొచ్చారు. అప్పుడే దీనిపై ఈ సోదరుల కన్ను పడింది. కానీ దాన్ని వారు సొంతం చేసుకోడానికి ఇరవైయేండ్లు పట్టింది.

అప్పటి వరకూ అది ఖాళీ ప్రదేశంలోనే ఉండిపోయి చాలా వరకూ పాడై పోయింది. దీన్ని రెస్టారెంట్‌‌గా మార్చేందుకు ఎన్నో కష్టాలు పడ్డారీ అన్నదమ్ములు. వాళ్లు కూడబెట్టుకున్న డబ్బంతా దాన్ని బాగుచేయడానికే వినియోగించారు. పాలస్తీనా జెండా రంగుతో ముందు భాగం.. జోర్డాన్‌‌ జెండా రంగుతో వెనుక భాగాన్ని పెయింట్‌‌ చేసి లోపల కుర్చీలు, టేబుళ్లు అమర్చి అందమైన రెస్టారెంట్‌‌గా తయారు చేశారు. అరవై ఏళ్ల వయసున్న ఈ ఫ్లైట్‌‌ మధ్యలో తన ప్రాభవాన్ని కోల్పోయినా ఇప్పుడు అక్కడి ప్రజలకు వినోదాన్ని పంచుతోంది. విమానం ఎక్కాలి అనుకున్న ఎందరో కలలను తీరుస్తూ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అయితే మన దేశంలో ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌‌లో ఫ్లైట్‌‌ రెస్టారెంట్స్‌‌ ఉన్నాయి. విజయవాడ దగ్గరలో కూడా ఇలాంటి ఫ్లైట్‌‌ రెస్టారెంట్‌‌కి ప్లాన్‌‌ చేస్తున్నారు.