చేర్యాలలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ.. గో బ్యాక్ అంటూ హోరెత్తిన నినాదాలు

సిద్దిపేట జిల్లా చేర్యాలలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. చేర్యాల పర్యటకు వెళ్లిన రాజేశ్వర్ రెడ్డిని స్థానికులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని చేపడుతున్న నిరాహార దీక్ష దగ్గరకు వచ్చి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. 

దీంతో పల్లాను చూసి ఆందోళన కారులు ఒక్కసారిగా ఆయనపైకి ఎగబడి.. పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పల్లా వెనుదిరిగి వెళ్లారు. ఆందోళకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 

Also Read :- ఏడుపాయల దుర్గమ్మ.. దసరాకు దర్శించుకుందామా..!

అటు నిన్న, మొన్నటి వరకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి ఢీ అంటే ఢీ అన్నట్టుగా వాడి వేడి కొనసాగింది. తాజాగా హైదరాబాద్ మహానగరంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇరువురు ఒకటయ్యారు. 

హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పల్లా ముత్తిరెడ్డి,మధ్య సయోద్య కుదిరింది. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి సయోద్య కు దిర్చారు మంత్రి కేటీఆర్.